Policy:Privacy policy/Definitions/te
Appearance
Outdated translations are marked like this.
అనువాదంలో సాయం చేయాలనుకుంటున్నారా? తప్పిపోయిన సందేశాలను అనువదించండి
Wikimedia Foundation Privacy Policy Definitions
మేం ఇలా అంటే... | ...దానర్థం ఇది: |
---|---|
"వికీమీడియా ఫౌండేషన్" / "ఫౌండేషన్" / "మేము" / "మమ్మల్ని" / "మా" | ది వికీమీడియా ఫౌండేషన్, ఇంక్., వికీమీడియా సైట్లను నడిపే లాభాపేక్షలేని సంస్థ. |
"వికీమీడియా సైట్లు" / "మా సేవలు" | వికీమీడియా వెబ్‌సైట్లు, సేవలు (భాషాతీతంగా), వికీపీడియా, వికీమీడియా కామన్స్ వంటి ప్రధాన ప్రాజెక్టులతో సహా, మొబైలు అనువర్తనాలతో సహా, APIలు, ఈమెయిళ్ళు, నోటిఫికేషన్లన్నీ: కింది "ఈ గోప్యతా విధానము పరిధి లోకి రానివి" విభాగంలో చూపించిన సైట్లు, సేవలను మినహాయించి. |
"మీరు" / "మీ" / "నేను" | మీరు - వ్యక్తి అయినా, సమూహం లేదా సంస్థైనా సరే, వికీమీడియా సైట్లు, సేవలను వాడుతున్నది మీ తరపునైనా, ఇతరుల తరపునైనా సరే. |
"ఈ విధానం" / "ఈ గోప్యతా విధానం" | "వికీమీడియా ఫౌండేషను గోప్యతా విధానము" అనే ఈ పత్రం. |
"తోడ్పాటు" | వికీమీడియా సైట్లలో మీరు చేసే మార్పుచేర్పులు, అందించే కంటెంటు. |
"వ్యక్తిగత సమాచారం" | మిమ్మల్ని వ్యకిగతంగా గుర్తించగలిగే సమాచారం -మీరు మాకిచ్చేదీ, మేం మీ నుండి సేకరించేదీ. స్పష్టంగా చెప్పాలంటే, కింది సమాచారాలన్నిటినీ మేము సేకరించకపోయినప్పటికీ, వీటిని "వ్యక్తిగత సమాచారం"గా భావిస్తాం -అది బహిరంగ సమాచారం కాకపోతే, దాని సహాయంతో మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగలిగితే.
|
"థర్డ్ పార్టీ" / "థర్డ్ పార్టీలు" | వికీమీడియాఅ ఫౌండేషను నియంత్రణలో గాని, నిర్వహణలో గాని, ఆపరేషనులో గానీ లేని వ్యక్తులు, సంస్థలు, వెబ్‌సైట్లు, సేవలు, ఉత్పత్తులు, అనువర్తనాలు. వీటిలో [[:m:Special:MyLanguage/Wikimedia chapters|వికీమీడియా చాప్టర్లు], థిమాటిక్ సంస్థలు, వాడుకరి సమూహాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, ఉద్యోగులు, డైరెక్టర్లు, ఆఫీసర్లు, గ్రాంట్ల లభ్దిదారులు, వంటి వికీమీడియా ఉద్యమానికి తోడ్పాటు అందించే ఇతర వికీమీడియా వాడుకరులు, స్వతంత్ర సంస్థలు, సమూహాలు మరియు ఆయా సంస్థల కాంట్రాక్టర్లు, సమూహాలు ఉన్నాయి. |