గోప్యతా విధానము/సారాంశం
Appearance
Outdated translations are marked like this.
అనువాదంలో సాయం చేయాలనుకుంటున్నారా? తప్పిపోయిన సందేశాలను అనువదించండి
Wikimedia Foundation Privacy Policy
This is a summary of the Privacy Policy. To read the full terms, click here.
నిష్పూచీ: ఈ సారాంశం, గోప్యతా విధానములో భాగం కాదు. ఇది చట్టబద్ధమైన పత్రం కాదు. పూర్తి గోప్యతా విధానాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కరదీపిక లాంటిది మాత్రమే. మా గోప్యతా విధానానికి వాడుకరి హితమైన ఇంటరుఫేసుగా దీన్ని భావించండి.
స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో పాల్గొనేందుకు మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని మేం విశ్వసిస్తాం కాబట్టి, మీరు:
- ఏ వికీమీడియా సైటులోనైనా ఖాతా ఏమీ సృష్టించుకోకుండానే చదవొచ్చు, రాయవచ్చు, వాడుకోవచ్చు.
- మీ ఈమెయిలు చిరునామా గానీ, స్వంత పేరు గానీ ఇవ్వకుండానే ఖాతా కోసం నమోదు చేసుకోవచ్చు.
మీ కోసం వికీమీడియా సైట్లను మెరుగు పరచేందుకు గాను, వాటిని ప్రజలు ఎలా వాడుకుంటున్నారో తెలుసుకోవా లనుకుంటున్నాం కాబట్టి, మీరు కింది పనులు చేసినపుడు మేము కొంత సమాచారాన్ని సేకరిస్తాం:
- బహింరంగంగా తోడ్పాటు అందించినపుడు.
- ఖాతా సృష్టించినపుడు లేదా మీ వాడుకరి పేజీని తాజాకరించినపుడు.
- వికీమీడియా సైట్లను వాడినపుడు.
- మాకు ఈమెయిళ్ళు పంపినపుడు లేదా సర్వేలు లేదా ఫీడ్బ్యాకుల లో పాల్గొన్నపుడు.
మేము కిందివాటికి నిబద్ధులమై ఉన్నాం:
- మీ సమాచారాన్ని ఎలా వాడుకుంటామో, ఎలా పంచుకుంటామో ఈ గోప్యతా విధానములో వివరించేందుకు.
- మీ సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు గాను, చర్యలు తీసుకునేందుకు.
- వాణిజ్య అవసరాల కోసం థర్డ్ పార్టీలతో మీ సమాచారాన్ని పంచుకోవడం లేదా అమ్మడం ఎన్నటికీ చెయ్యకుండా ఉండేందుకు.
- వికీమీడియా సైట్లను మెరుగు పరచడం, చట్టబద్ధంగా నడచుకోవడం, మిమ్మల్ని, ఇతరులనూ సంరక్షించడం లాంటి పరిమిత సందర్భాల్లోనే మీ సమాచారాన్ని పంచుకునేందుకు.
- వికీమీడియా సైట్ల నిర్వహణ కోసము, అర్థం చేసుకుని మెరుగుపరచడం కోసము, చట్టబద్ధమైన అవసరాల కోసమూ ఎంత తక్కువ కాలం మాకు అవసరమో అంతే కాలం మీ డేటాను మావద్ద ఉంచుకునేందుకు.
గుర్తుంచుకోండి:
- ఏదైనా వికీమీడియా సైటులో మీరు చేసే మార్పుచేర్పులు బహిరంగంగా, శాశ్వతంగా ఉంటాయి.
- మీరు లాగిన్ అవకుండా ఏదైనా వికీమీడియా సైటులో మార్పుచేర్పులు చేస్తే, అవి వాడుకరిపేరుకు కాక, అప్పటి ఐపీ చిరునామాకు ఆపాదించబడతాయి.
- మా స్వచ్ఛంద రచయితల సముదాయం స్వీయ నియంత్రిత సంఘం. సముదాయం ఎంచుకున్న నిర్వాహకులకు, ఇటీవలి రచనల గురించిన గోప్య సమాచారం కొంత అందుబాటులో ఉంటుంది. వికీమీడియాఅ సైట్ల భద్రతకు, విధానాల అమలుకూ ఇది అవసరం.
- ఈ గోప్యతా విధానము వికీమీడియా ఫౌండేషను నడిపే అన్ని సైట్లకు, సేవలకూ వర్తించదు. తమ స్వంత గోప్యతా విధానం కలిగినవి ఉన్నాయి (Wikimedia Shop లాంటివి) లేదా థర్డ్ పార్టీలు నడిపే సైట్లు, సేవలు (Wikimedia Cloud Services లోని థర్డ్ పార్టీ డెవలపర్ ప్రాజెక్టులు లాంటివి).
- ప్రపంచ వ్యాప్తంగా విద్య పట్ల, పరిశోధన పట్లా మాకున్న నిబద్ధతలో భాగంగా, అప్పుడప్పుడూ మేము సార్వజనిక సమాచారాన్ని, సంకలిత లేదా వ్యక్తిగతం కాని సమాచారాన్ని డేటా డంపులు, డేటా సెట్ల ద్వారా బహిరంగ పరుస్తూంటాం.
- మీకు ఈ గోప్యతా విధానం ఆమోదం కాని పక్షంలో, వికీమీడియా ఫౌండేషను మరియు ఇతర వాడుకరుల భద్రత కోసం గాను, మీరు వికీమీడియా సైట్లను వాడకుంటే మంచిది.